హైదరాబాద్: రాజ్‌భవన్‌లో శుక్రవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కాంగ్రెస్ నాయకులు దూరంగా ఉన్నారు. ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్ విడిది సందర్భంగా ఆయన గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చిన విందుకు తమను ఆహ్వానించకపోవడాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుబడుతున్నారు.
పలు సందర్భాలు, అంశాల్లో అధికారపక్షానికి అనుకూలంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయంతో కాంగ్రెస్ నాయకులున్నారు. అందువల్లే గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్‌విందులో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.