
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను గురువారం కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై గవర్నర్‌కు ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంపై శ్వేతపత్రం ఇచ్చేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పోలవరంపై ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కౌంటర్ వేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఆధారాలతో సహా గవర్నర్‌కు వివరించానని కేవీపీ వెల్లడించారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ
Comments
Please login to add a commentAdd a comment