సాక్షి, విజయవాడ: పొత్తులతో ఎన్నికలకు వెళ్లిన పార్టీల్లో నితీష్ కుమార్ తర్వాత ఆ రికార్డ్ చంద్రబాబుకే దక్కుతుందంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు సభకు వెళ్తుంటే రాహుల్ కాన్వాయ్‌పై చంద్రబాబు రాళ్లు, కోడిగుడ్లు విసిరించాడని, తిరుపతిలో అమిత్ షా పై రాళ్లేయించాడని కేవీపీ గుర్తు చేశారు.
‘‘రాజకీయ చతురుడని చంద్రబాబు తనకి తానే అనుకుంటాడు. అపవిత్ర రాజకీయంలో చంద్రబాబు రికార్డు ఎవరూ బద్ధలు కొట్టలేరు. 2019లో చంద్రబాబు దేనికోసం పోరాడారు. ఏపీ భవన్‌లో ధర్మపోరాట దీక్ష ఏయే ప్రయోజనాలను ఆశించి చేశారు. ప్రత్యేకహోదా ఎందుకు వద్దన్నారు.. ప్యాకేజీ ఎందుకు ముద్దన్నారు. స్వీట్లు పంచి.. పండుగ చేసుకుని ఏం సాధించారు’’ అంటూ కేవీపీ ప్రశ్నించారు.
‘‘మోదీ కుటుంబ విషయాల గురించి ప్రస్తావించిన వ్యక్తి చంద్రబాబు. అందుకే చంద్రబాబుకు మోదీ కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. తాను కలవకుండా అమిత్ షా.. నడ్డా వద్దకు పంపించారు. అభద్రతాభావం కలగగానే చంద్రబాబుకు జాతి ప్రయోజనాలు గుర్తొస్తాయి. ఢిల్లీకి ఎందుకెళ్లారో ఏపీ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: రామోజీ మానసిక ఉన్మాదం ఏ స్థాయిలో ఉందంటే..
Comments
Please login to add a commentAdd a comment