
రాహుల్ సభ వేదిక మార్పు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం జూన్ 4న అన్ని రాజకీయ పక్షాలతో గుంటూరులో ‘ప్రత్యేక హోదా–ఆంధ్రుల హక్కు’ నినాదంతో సభ నిర్వహిస్తున్నట్లు పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు.
సోమవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, జేడీఏ, డీఎంకే సహా పలు పార్టీల నేతలు హాజరు కానున్నారని రఘువీరా చెప్పారు.