రఘువీరా రెడ్డి
అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి అతి హేయమైనదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ..దాడి జరిగిన వీఐపీ లాంజ్‌లో సీసీ కెమెరా ఎందుకు పనిచేయడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. తాను వైఎస్ జగన్‌తో విభేదించవచ్చు.. కానీ జరిగిన దాడిని మాత్రం ఖండిస్తున్నానని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే ఒక ముఖ్యమంత్రి కనీసం ఫోన్ చేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి అనేది ఒక బలీయమైన వ్యవస్థ అని, ఒక విశ్వసనీయ సమాచారం వస్తే విచారణ చేయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గరుడపురాణాన్ని ధ్రువీకరించారని, గరుడపురాణమంటూ ఆ వ్యక్తి చెప్పినట్టే జరుగుతుంది అనుకుంటే ఎందుకు విచారణ చేయించలేదని ప్రశ్నించారు. మీ ఇంటెలిజెన్స్ ఎక్కడికి పోయిందని ఎద్దేవా చేశారు. ఇక ఆ గరుడపురాణం చెప్పిన వ్యక్తినే సీఎం కుర్చీలో కూర్చోబెట్టండి.. మీరెందుకు దండగ అని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment