
వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ
సాక్షి, అమరావతి: అభిమానులైతే కాళ్లకు దండాలు పెడతారు లేదంటే దండలు వేసి అభిమానం చాటుకుంటారు.. అలా గాకుండా అభిమానులు హత్యాయత్నం చేస్తారా అని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ టీడీపీ నాయకులనుద్దేశించి ప్రశ్నించారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమాని అని టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిజా నిజాలు బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగితే సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమే అవుతుందని వ్యాఖ్యానించారు.
పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం: బొత్స ఝాన్సీ
వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిని తీవ్రంగా వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సరికాదని, ఇది పూర్తిగా ప్రభుత్వ భద్రతా వైఫల్యమని విమర్శించారు. ప్రతిపక్ష నేతకే భద్రత కల్పించలేని ప్రభుత్వం, సామాన్యుడికెట్లా రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment