'రాష్ట్రపతి తక్షణం జోక్యం చేసుకోవాలని లేఖ' | Raghuveera reddy letter to president pranab mukherjee over ysrcp mlas in ap cabinet | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులపై రాష్ట్రపతికి రఘువీరా లేఖ

Published Tue, Apr 4 2017 5:01 PM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

'రాష్ట్రపతి తక్షణం జోక్యం చేసుకోవాలని లేఖ' - Sakshi

'రాష్ట్రపతి తక్షణం జోక్యం చేసుకోవాలని లేఖ'

అమరావతి: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి మంగళవారం లేఖ రాశారు.  పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలను నిరోధించాలని ఆయన ఆ లేఖలో కోరారు.  

ప్రతిపక్షం  వైఎస్‌ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి చేర్చుకోవడం జరిగిందని, ఫిరాయించిన వారు తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయకుండా టీడీపీలో కొనసాగుతున్నారని రఘువీరా లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో కూడా స్థానం కల్పించారని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలను పరిరక్షించాల్సిన గవర్నర్‌, స్పీకర్‌ వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని తక్షణమే రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని పార్టీ తరపున రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement