
అనంతపురంలో రాష్ట్రపతి పర్యటన ఖరారు: రఘువీరారెడ్డి
అనంతపురం: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన అనంతరపురం జిల్లాలో ఖరారైయిందని మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 23న నీలం సంజీవరెడ్డి శతజయంతి ముగింపు ఉత్సవాలకు హాజరుకానున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం మంత్రి శైలజానాథ్ నేతృత్వంలో ప్రతినిధుల బృందంతో ప్రణబ్‌ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని కోరుతామని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు.
కాగా, దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటారు.