
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్‌తో స్నేహంగా ఉన్న 20 పార్టీలు అవిశ్వాసానికి మద్దతిస్తాయని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీలను సంప్రదించాలని లోకసభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున ఖర్గేను సోనియా ఆదేశించారని రఘువీరా తెలిపారు. ప్రత్యేక హోదాకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ మెడలు వంచేందుకు పూర్తిగా సహకరిస్తామని రఘువీరా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment