కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట వీధికెక్కింది. పోలీసు కేసుల వరకు వెళ్లింది. టీడీపీతో కుమ్మక్కయ్యారని ప్రశ్నించిన సొంత పార్టీ నాయకుడిపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేశారు. తనపై పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి దాడి చేయించారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుంకర కృష్ణమూర్తి శుక్రవారం గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన సామాజిక వర్గానికి సీటు కేటాయించమని అడిగినందుకు తనపై దాడి చేయించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.