
బాబేమైనా నీతిమంతుడా? : రఘువీరా
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమైనా నీతిమంతుడా? అని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి సూటిగా ప్రశ్నించారు.
మడకశిర/అమడగూరు/సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమైనా నీతిమంతుడా? అని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్, శశికళ అవినీతి గురించి మాట్లాడే ముందు చంద్రబాబు తనపై ఉన్న అవినీతి కేసులపై ఎందుకు కోర్టుకెళ్లి స్టే తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన దేశంలోనే పెద్ద అవినీతిపరుడని ధ్వజమెత్తారు.
శుక్రవారం అనంతపురం జిల్లా మడకశిరలో, అమడగూరు మండలం మహమ్మదాబాద్‌లో రఘువీరా విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ ఓట్ల కోసమే యూపీలో రైతులకు రుణమాఫీ ప్రకటించారని విమర్శించారు. 2019లోగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీ, టీడీపీ రాష్ట్రంలో గల్లంతు కావడం ఖాయమన్నారు.