'ఆ ముగ్గురిపై 420 కేసు పెట్టాలి'
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఫైర్ అయ్యారు.
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఫైర్ అయ్యారు. ఓటుకు కోట్లు కేసు కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అనంతపురంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే అసెంబ్లీ సీట్ల పెంపే ముఖ్యమా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ , వెంకయ్య, చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలని రఘువీరా అన్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై బహిరంగ చర్చకు సిద్దమా అని ప్రశ్నించారు.
చంద్రబాబు విదేశీ పర్యటనలన్నీ ఓ బూటకమన్నారు. 22 దేశాలు తిరిగిన చంద్రబాబు ఒక్క పరిశ్రమను తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడం.. హైకోర్టును ధిక్కరించటమే అన్నారు. విశాఖపట్నం బీచ్‌లో జరిగే యువత క్యాండిల్ దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్నట్టు ఆయన తెలిపారు.