బహిరంగ చర్చకు సిద్ధమా.. చంద్రబాబుకు సవాల్‌! | raghuveera reddy challenges on projects cost | Sakshi

బహిరంగ చర్చకు సిద్ధమా.. చంద్రబాబుకు సవాల్‌!

Published Sun, Jan 8 2017 1:42 PM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

బహిరంగ చర్చకు సిద్ధమా.. చంద్రబాబుకు సవాల్‌!

బహిరంగ చర్చకు సిద్ధమా.. చంద్రబాబుకు సవాల్‌!

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసి చంద్రబాబు ప్రభుత్వం వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నదని..

విజయవాడ: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసి చంద్రబాబు ప్రభుత్వం వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నదని ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి దుయ్యబట్టారు. ఈ విషయంలో ప్రాజెక్టుల వద్దే బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేస్తూ ఆయన ఆదివారం చంద్రబాబుకు లేఖ రాశారు.

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 16వేల కోట్ల నుంచి రూ. 40వేలకోట్లకు పెంచేశారని, అదేవిధంగా హంద్రీనీవా అంచనా వ్యయాన్ని రూ. 6వేల కోట్ల నుంచి 11వేల కోట్లకు పెంచేశారని ఆయన ఆక్షేపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement