
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు పోలవరం పూర్తి చెయ్యలేక కాంగ్రెస్ పై నిందలు వేస్తున్నారని.. మూడేళ్లుగా ప్రాజెక్టుకు కనీస నిధులు తెచ్చుకోలేని దద్దమ్మ చంద్రబాబు అని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. 'బాబు ఈ ప్రాజెక్టును పూర్తి చెయ్యలేడని ముందు నుంచి చెప్తున్నాం. ఇప్పుడూ అదే మాటకు కట్టుబడి ఉన్నాం.
ప్రాజెక్ట్‌కు ఒక్క రుపాయి కూడా రాష్ట్ర ఖజానా నుంచి నిధులు ఇవ్వడానికి వీలులేదు. నిధులన్నీ కేంద్రం నుంచే రప్పించాలి. ప్రాజెక్ట్ విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కమీషన్ల కక్కుర్తిలో పోలవరం ప్రాజెక్ట్ నలిగిపోతోంది. చేతకాకపోతే ప్రాజెక్ట్ నుంచి, పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై వచ్చే నెల 19 వ తేదీలోపు స్పష్టత ఇవ్వలేకపోతే ప్రాజెక్ట్ వద్ద దీక్ష చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment