
'హోదాను బాబు తాకట్టుపెట్టారు'
చంద్రబాబు స్వార్థప్రయోజనాల కోసమే ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని రఘువీరారెడ్డి విమర్శించారు.
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వార్థప్రయోజనాల కోసమే ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు.
అనంతలో గురువారం ఆయన జాతీయ జెండాలతో మౌనప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే బాబు అష్టకష్టాలు పడుతున్నారన్నారు.