
'స్పీకర్ వ్యాఖ్యలను సీఎం సమర్థించడం దారుణం'
విజయవాడ : మహిళలపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు సమర్థించడం దారుణమని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. హోదాతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ఊరురా ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తామని రఘువీరా తెలిపారు.