ఎన్నికల హామీల అమలును విస్మరించి టీడీపీ, బీజేపీలు అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘టీడీపీ ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటికూడా అమలు చేయలేదు. తొలి సంతకం అయిన బెల్ట్ షాపుల తొలగింపు కూడా అమలు కాలేదు. హుద్‌హుద్ తుఫాన్ సహాయంగా వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని మోడీ నేటికి ఇచ్చింది మాత్రం 400 కోట్లు మాత్రమే. రెవిన్యూ లోటు భర్తీ, దుగ్గరాజు పట్నం ఓడరేవు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ వంటి విభజన చట్ట హామీలు అమలుకు నోచుకోవడం లేదు’ అని అన్నారు.