
పవన్ కల్యాణ్, ఎన్.రఘువీరారెడ్డి (పాత ఫొటోలు)
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన ఆర్థిక సహాయం గురించి చర్చించేందుకు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫోన్ చేసినా ఆయన స్పందించలేదని తెలిసింది. సోమవారం రఘువీరా పుట్టినరోజు కావడంతో ఆయన కుటుంబ సభ్యులతో తప్ప ఎవరితోనూ మాట్లాడరని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.
కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై నిజనిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలు వెల్లడిస్తామని పవన్ కల్యాణ్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. రఘువీరా స్పందించకపోవడంతో ఆయన సతీమణి సునీతకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేసినా మరొకరోజు మాట్లాడాలని ఆమె పవన్‌కు చెప్పినట్లు సమాచారం. కాగా, ఇటీవల లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను పవన్ కలిసిన సంగతి తెలిసిందే.