వైఎస్ జగన్‌కు బహిరంగ లేఖ రాసి ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తన అక్కసు వెళ్లగక్కారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ, ఈజిప్టు మమ్మీ రెండు ఒకటేనని వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్ పేరును ఉచ్చరించే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. కుక్కలు చించిన విస్తరిలా ఉన్న కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత మహానేత వైఎస్‌ఆర్‌దేనని గుర్తు చేశారు.