
వెంకయ్య నోరు తెరిస్తే అబద్ధాలే: రఘువీరా
సాక్షి, హైదరాబాద్: నోరు తెరిస్తే అబద్ధాలే చెప్పే వెంకయ్యనాయుడు ఇప్పటికైనా ప్రజలకు నిజాలు చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హితవుపలికారు. హైదరాబాద్‌లోని ఇందిర భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాటాడారు. బీజేపీ రాష్ట్ర మేనిఫెస్టోలో 10 ఏళ్ల ప్రత్యేక హోదా అమలు చేస్తామని నాలుగు బడ్జెట్‌లు గడచిపోయాయనీ హోదా ఏమైందని ప్రశ్నించారు.
బహిరంగ చర్చకు వస్తే వారు చెప్పేవన్నీ 90 శాతం అబద్ధా్దలేనని తాము నిరూపిస్తామని వెంకయ్య నాయుడుకు ఆయన సవాల్ విసిరారు. ఈ నెల 10న గుంటూరులో పీసీసీ రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు రఘువీరారెడ్డి తెలిపారు.