
సాక్షి, తిరుపతి: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటోలకు పోజులివ్వడం తప్ప.. చేసిందేమీ లేదని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం గురువారం కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో 48 గంటల పాటు దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో రఘువీరారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. చంద్రబాబు సెల్ఫీ రాజా అని ఏద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై ఆయనకు చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. పార్లమెంటును ప్రజా దేవాలయంగా చంద్రబాబు భావించలేదని ఆరోపించారు. హోదా కోసం కాంగ్రెస్ 29 రాష్ట్రాలలో తీర్మానాలు చేయించిదని గుర్తు చేశారు. అంతేకాకుండా హోదా కోసం రాహుల్ గాంధీ తొలి సంతకం చేస్తారని తెలిపారు.