
సాక్షి, కడప: పార్టీ ఫిరాయింపుదారులను వెంటనే సస్పెండ్ చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ పదవిని కోడెల భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని, లేకుంటే నిర్వాసితులతో కలిసి సామూహిక దీక్ష చేపడతామని రఘువీరారెడ్డి హెచ్చరించారు.
కాగా, తమ పార్టీ నుంచి అధికార టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వైఎస్సార్ సీపీ కూడా డిమాండ్ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment