'ఇద్దరూ అమావాస్య చంద్రులే'
'ఇద్దరూ అమావాస్య చంద్రులే'
Published Sat, Mar 11 2017 10:31 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
భద్రాద్రి: రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న అమావాస్య చంద్రులు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి ఎద్దేవా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ మంత్రి మనమా వెంకటేశ్వరరావు ఇంట్లో శనివారం జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. మీడియాను భయాందోళనలకు గురి చేస్తున్న ఇద్దరు చంద్రులు ప్రజలకు అభివృద్ధి భ్రమలు చూపిస్తున్నారని అన్నారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్, ఆంధ్రలో టీడీపీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆస్తులు ఆరు నెలల్లో వందల కోట్లకు ఎలా చేరాయో తెలపాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement