
‘హోదా’ సాధించుకుందాం: రఘువీరా
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీల ద్రోహానికి నిరసనగా 26న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద పార్టీలకు అతీతంగా చేతిలో జాతీయ జెండా, నల్లబ్యాడ్జీలతో మౌనదీక్ష చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. హోదా కోసం బలపర్చే ప్రతి ఒక్కరూ మౌనదీక్షకు సహాయ, సహకారాలు అందివ్వాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ఈ హక్కును అమలు చేయడంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయన్నారు.