
సాక్షి, అమరావతి : అసెంబ్లీలో స్పీకర్, సభా నాయకుని పట్ల ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీ వేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి స్పీకర్‌ను కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఇలాంటి ఘటనలు, వాటి పర్యవసానాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటివరకున్న సాంప్రదాయం ప్రకారం తాను చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. లేదా ఎథిక్స్ కమిటీ వేయమని స్పీకర్‌ను కోరారు. ప్రస్తుత చర్చల్లో వ్యక్తిగత దూషణలు, కుటుంబాల ప్రస్తావన, కులాలు, మతాలు, వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం లాంటి పరిణామాలు మంచివి కాదన్నారు.
మనుషులన్నాక పొరపాట్లు చేస్తారని, ఈ విషయాన్ని చంద్రబాబు ఒప్పుకొని సభకు క్షమాపణ చెప్పాలని, లేదా మాటను వెనక్కి తీసుకోవాలని సూచించారు. లేకపోతే ఎథిక్స్ కమిటీ వేస్తే అందులోని సభ్యులే ఎవరిది తప్పో నిర్ణయిస్తారని పేర్కొన్నారు. సభ ఇలాగే కొనసాగితే సయమం వృథా అవుతుండడంతో పాటు ప్రజా సమస్యలు చర్చకు రాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్పందించిన స్పీకర్ క్షమాపణ చెప్పాలా? లేదా? అన్నది చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నా. క్షమాపణ చెప్పకపోతే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment