
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని వెంకటగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏమి చేసినా ముందుగా ప్రజలకు, మీడియాకు చెప్పే చేస్తారని అన్నారు. వరదల కారణంగా రాజధాని ప్రాంతం ముంపుకు గురైనందువల్ల దాని పరిష్కారం కోసం మాత్రమే చర్యలు చేపడుతున్నారని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు.
సోమశిల - స్వర్ణముఖి లింక్ కెనాల్ పూర్తిచేసి, సోమశిల ద్వారా తెలుగు గంగ, ఎస్.ఎస్. కెనాల్‌లకు నీరు అందిస్తామన్నారు. వెంకటగిరిలో ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా జరిగే శ్రీ పోలేరమ్మ జాతర ఏర్పాట్లను ప్రజల సలహాలతో, ప్రభుత్వ శాఖల సమన్వయంతో సంప్రదాయబద్దంగా నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment