
సాక్షి, తణుకు (పశ్చిమ గోదావరి): ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభద్రతాభావంతో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిస్తే చంద్రబాబుకు ఎక్కడా లేని భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం తణుకులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రెండు పార్టీల నాయకులు ఎక్కడైనా కలిసినా, మాట్లాడుకున్నా చంద్రబాబుకు భయం కలుగుతుందని విమర్శించారు.
‘చంద్రబాబు కేసీఆర్‌తో పొత్తు అడిగితే ఆయన బాబు నీకో దండం, నీతో పొత్తు వద్దన్నారు మర్చిపోయారా?. చంద్రబాబు శవరాజకీయాలు చేయటానికి కూడా సిద్దమవుతారు. హరికృష్ణ మృతదేహం వద్ద కూడా కేటీఆర్‌తో చంద్రబాబు రాజకీయాలు మాట్లాడారు. శవాల మీద పేలాలు వేరుకొని తినే మనస్తత్వం గల చంద్రబాబు.. కేటీఆర్ వద్ద కూడా తిరస్కరించబడ్డారు. టీఆర్‌ఎస్ పార్టీ ఛీ పొమ్మంటే కాంగ్రెస్‌తో చంద్రబాబు జతకట్టారు’అంటూ చంద్రబాబుపై ఆనం రాంనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment