
సాక్షి, నెల్లూరు : అపవిత్రమైన కూటమిని ప్రజలు తెలంగాణలో తిరస్కరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దేశంలో చక్రం తిప్పుతానన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి అడుగులోనే బోల్తా పడ్డారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కోట్ల రూపాయల డబ్బును చంద్రబాబు తెలంగాణలో ప్రచారానికి ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రెండు సీట్లు గెలిచి ప్రధాని మోదీతో పోరాటం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు చంద్రబాబుకి బుద్ది చెప్పాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని గడిచిన 3 దశాబ్దాలుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని నిప్పులు చెరిగారు.
హరికృష్ణ కూతురు సుహాసినిని ఎన్నికల్లో పోటీ చేయమన్నప్పుడే ఎన్టీఆర్ కుటుంబానికి అనుమానం వచ్చిందని ఆనం అన్నారు. నందమూరి కుటుంబాలను రాజకీయంగా నాశనం చేయడమే చంద్రబాబు ధ్యేయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment