టీడీపీలో చేరాలని ఆహ్వానం అందలేదు: ఆనం | I have not get invitation from TDP, says Former Minister Anam Ram Narayana Reddy | Sakshi
Sakshi News home page

టీడీపీలో చేరాలని ఆహ్వానం అందలేదు: ఆనం

Published Mon, Jun 16 2014 1:53 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

టీడీపీలో చేరాలని ఆహ్వానం అందలేదు: ఆనం - Sakshi

టీడీపీలో చేరాలని ఆహ్వానం అందలేదు: ఆనం

టీడీపీలో చేరాలని ఆహ్వానం అందలేదని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

హైదరాబాద్: టీడీపీలో చేరాలని ఆహ్వానం అందలేదని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ కు చావుదెబ్బ తగలడంతో ఇటీవల కాలంలో ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్టు ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. 
 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగతంగా 35 ఏళ్ల అనుబంధం ఉందని ఓ ప్రశ్నకు మాజీ మంత్రి ఆనం సమాధానమిచ్చారు. గతంలోనూ  టీడీపీలో పనిచేశాను... ఆ పార్టీ నేతలతో సంబంధాలు కొనసాగుతున్నాయని ఆనం అన్నారు.
 
అయితే తాను టీడీపీలో చేరే ఆలోచనలో ప్రస్తుతం లేనని... ఆ పార్టీ నుంచి ఆహ్వానం అందలేదని ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement