తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తన సొంత వ్యవహారంగా చూస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కట్టబెట్టాలన్న కోర్ కమిటీ నిర్ణయం దిగ్భ్రాంతికి గురి చేస్తోందంటూ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఓ లేఖ రాశారు. తెలంగాణపై ఇటు కాంగ్రెస్ పార్టీ గానీ, కేంద్ర ప్రభుత్వంగానీ తమ వైఖరి ఏంటో చెప్పలేదని, వైఖరి తేల్చకుండానే ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజిస్తామంటే ఏ విధంగా సమంజమసని లేఖలో నిలదీశారు. ముందుగా కాంగ్రెస్, కేంద్రం తమ వైఖరి స్పష్టం చేసి అటుపై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని, తర్వాత మిగిలిన పార్టీ నేతలను కూడా ఆహ్వానించి విస్తృత చర్చ జరపాలని కోరారు. ఈ ప్రక్రియ ఏమీ జరగకుండానే.. చర్చలు ముగిశాయి, నిర్ణయమే తరువాయి అనడం నియంతృత్వమని దుమ్మెత్తి పోశారు. ఏక పక్ష నిర్ణయాలతో ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకూడదని, ఆచరణ సాధ్యమైన పద్ధతిలో అందరికీ ఆమోదమయ్యేలా సమస్య పరిష్కరించాలని కోరారు. తెలంగాణ అంశంలో కాంగ్రెస్ పార్టీ తన సొంత రాజకీయ లబ్ధి కోసం అడ్డుగోలుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
Published Wed, Jul 17 2013 4:45 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement