
ఇండోర్ : బంగారం కొనేందుకు వచ్చినట్లు నటించి జ్యువెల్లరీ షాపు యజమాని కంట్లో కారం కొట్టి ఆభరణాలు చోరీ చేసేందుకు యత్నించాడు. అయితే ఆ యువకుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్‌లో చోటుచేసుకుంది. సరాఫా ప్రాంతంలో లవీన్ సోని అనే వ్యాపారి జ్యువెల్లరీ షాపు నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆభరణాలు కొనేందుకు దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి.. సోని కంట్లో కారం కొట్టి 50 గ్రాముల బంగారు ఆభరణాలతో పారిపోయేందుకు ప్రయత్నించాడు.(డిసెంబరు 3 నాటికి కరోనా కనుమరుగవుతుంది!)
ఆ వ్యక్తి బంగారంతో పారిపోవడం గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మొత్తం షాపులోని సీసీకెమెరాల్లో రికార్డు అయ్యింది. పోలీసుల విచారణలో నిందితుడు మధ్యప్రదేశ్ దేవాస్ ప్రాంతానికి చెందిన ఆనంద్‌గా గుర్తించారు. సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నామని, షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సరాఫా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జీ అమృత సింగ్ సోలంకి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment