లక్నో: ఉత్తరప్రదేశ్ లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారెందుకని ప్రశ్నించినందుకు ఓ పోలీస్ అధికారిని దుండగులు తుపాకీతో కాల్చి పారిపోయారు. రాజేంద్ర ద్వివేది (50) లక్నోలోని టీపీనగర్ ప్రాంతంలో సోమవారం ఉదయం పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఒక బంగారు దుకాణం దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను గమనించి ప్రశ్నించారు. వారిలో ఒకడిని పట్టుకున్నారు. దీంతో మరో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఎస్ఐ నడుము భాగంలో బుల్లెట్ దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
ఎస్ఐ పై కాల్పుల సందర్భంగా మిగిలిన పోలీసులు కాల్పులు జరిపినప్పటికీ వారు తప్పించుకొని పారిపోయారని సరోజినగర్ పోలీస్ స్టేషన్ అధికారి సుధీర్ కుమార్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన ద్వివేది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.