
బెంగళూరు: గార్డెన్ సిటీగా పిలుచుకునే బెంగళూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా నగరం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో ఈ వర్షాల దెబ్బకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉండగా వరద నీరు కారణంగా ఓ బంగారు షాపులోని ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆ యజమానికి తీవ్రంగా నష్టపోయాడు.
వివరాల్లోకి వెళితే.. మల్లీశ్వర్‌లోని 9వ క్రాస్‌లోని ఓ నగల దుకాణం వరద నీటిలో చిక్కుకుంది. కాసేపు తర్వాత అధికంగా వరద నీరు షాపులోకి రావడంతో అక్కడున్న బంగారు నగలు కొట్టుకుపోయాయి. దాదాపు రూ.2 కోట్ల విలువైన నగలు కొట్టుకుపోయినట్లు సమాచారం. దుకాణం సమీపంలో జరుగుతున్న పనులే నష్టానికి కారణమని దుకాణం యజమాని ఆరోపిస్తున్నాడు. షాపులోని బంగారు ఆభరణాలు తడిసిపోయాయి.. కార్పొరేషన్‌కు ఫోన్ చేసి సహాయం కోరినా అధికారులు సాయం చేయకపోవడంతో 80 శాతం నగలు మాయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా నగరంలో భారీ మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోయింది. వానల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోడంతో పాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వ్యర్థాలను తొలగించేందుకు మున్సిపల్ కార్మికులు నానా తంటాలు పడుతున్నారు. చెట్లు కూలిపోయాయని, వరద నీరు నిలిచిపోయిందంటూ సుమారు ఇప్పటివరకు 600 వరకు ఫిర్యాదులు అందాయి.
చదవండి: వేదికపై ఫ్రెండ్స్ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి!