జ్యూయలరీ షాపు దగ్ధం | Fair accidents in Jewellery shop | Sakshi
Sakshi News home page

జ్యూయలరీ షాపు దగ్ధం

Oct 20 2013 12:31 AM | Updated on Sep 1 2017 11:47 PM

ప్రమాదవశాత్తు ఓ జ్యూయలరీ షాపు దగ్ధమైన ఘటన మండలంలోని నిజాంపేటలో శనివారం చోటుచేసుకుంది.

రామాయంపేట, న్యూస్‌లైన్: ప్రమాదవశాత్తు ఓ జ్యూయలరీ షాపు దగ్ధమైన ఘటన మండలంలోని నిజాంపేటలో శనివారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు 30 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడు సురేష్ చౌదరి కథనం ప్రకారం.. నిజాంపేట గ్రామానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ ఇంట్లో ఏడాది క్రితం శ్రీరాందేవ్ జ్యూయలరీ  పేరిట షాపు ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం రాత్రి  9 గంటల ప్రాంతంలో ఎప్పటిలాగే దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు.
 
 తెల్లవారుజామున దుకాణంలోంచి మంటలు అకస్మాత్తుగా చెలరేగడంతో చుట్టుపక్కల వారు సురేష్ చౌదరికి సమాచారం అందించారు. దీంతో ఆయన అక్కడకు చేరుకొని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి  మంటలను ఆర్పారు. అదే దుకాణంలో స్టీల్, ఫ్యాన్సీ సామగ్రి కూడా ఉండడంతో నష్టం భారీగా వాటిల్లింది. సుమారు 10 లక్షల విలువ గల స్టీల్, ఫ్యాన్సీ స్టోర్ సామగ్రి, 10 తులాల బంగారం, 20 కిలోల వెండి  పూర్తిగా దగ్ధమైందని, వీటి మొత్తం విలువ సుమారు రూ. 30 లక్షలు  ఉంటుందని బాధితుడు సురేష్ చౌదరి తెలిపారు. కాగా ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement