Fair accidents
-
గిట్టుబాటు ధర లేక 160 కేజీల ఉల్లిపాయల్ని తగలబెట్టిన రైతు!!
మధ్యప్రదేశ్‌లోని ఒక యువ రైతు రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందసౌర్ బహిరంగ వేలంలో 160 కిలోల వెల్లుల్లిని తగలబెట్టి తన పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించలేదన్న విషయాన్ని బహిరంగంగా వ్యక్తం చేశాడు. డియోలీకి చెందిన శంకర్ సిర్ఫిరా తన ఉత్పత్తులను మందసౌర్ మండిలో హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయించడానికి ప్రయత్నించినప్పుడు తీవ్ర నిరాశకు గురై ఈచర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత రైతు 'జై జవాన్ జై కిసాన్' అంటూ నినాదం చేశాడు. అయితే మండిలోని సిబ్బంది ఇతర రైతులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయడంతో హోల్‌సేల్ మార్కెట్లో ఎటువంటి నష్టం జరగకుండా నిరోధించారు. (చదవండి: బాప్రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్ వీడియో) ఈ మేరకు రైతు మాట్లాడుతూ..."నేను ఇక్కడ వెల్లుల్లి పంటను రవాణా చేయడానికి రూ. ఐదు వేల రూపాయాలు ఖర్చు పెట్టాను. కానీ కొనుగోలుదారుల నుండి రూ. 1,100 మాత్రమే పొందుతున్నాను. అందువల్ల కాల్చడం మంచిది అనిపించి ఇలా చేశాను. అంతేకాదు నేను వెల్లుల్లిని పండించడానికి రూ. 2.5 లక్షలు ఖర్చు చేశాను. అయితే నాకు మార్కెట్ ధర ప్రకారం కేవలం రూ.1 లక్ష మాత్రమే వచ్చింది," అని ఆవేదనగా శంకర్ చెప్పారు. ఈ క్రమంలో రైతును విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే పోలీస్ స్టేషన్ ఇన్చార్జి జితేంద్ర పాఠక్ ఇతర రైతుల ఉత్పత్తులకు అగ్నిప్రమాదం వల్ల ఎటువంటి నష్టం జరగలేదు కాబట్టి ఆ రైతు పై ఎటువంటి కేసు నమోదు చేయలేదని అన్నారు. ఏదిఏమైన రైతులు సరైన గిట్టుబాటు ధర లభించక ఆగ్రహంతో పంటను దహనం చేయడం ఇది మొదటిసారి కాదు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది. (చదవండి: బంగారు గనుల తవ్వకాల్లో బయటపడ్డ వెయ్యికాళ్ల ప్రాణి!) A young #Farmers Shankar Sirfira set ablaze around 160 kg garlic produce on not getting adequate price from traders during open auction in the Mandsaur Mandi @ndtv @ndtvindia pic.twitter.com/90wdDA7OR8 — Anurag Dwary (@Anurag_Dwary) December 19, 2021 -
ముంబై.. మండుతోంది!
సాక్షి, ముంబై: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల వల్ల అధిక శాతం అగ్నిప్రమాదాలు సంభవిస్తున్న నగరాల్లో ముంబై ముందు స్థానంలో ఉంది. దేశంలోని 88 నగరాలతో పోల్చుకుంటే నగరం అగ్రస్థానంలో ఉంది. 2008 నుంచి 2012 వరకు నగరంలో 245 అగ్ని ప్రమాదాలు జరుగగా ఇందులో 236 మంది మృత్యువాత పడ్డారు. ఇదే సమయంలో ఢిల్లీలో 185 అగ్ని ప్రమాదాల కేసులు నమోదు కాగా 186 మంది మృతి చెందినట్లు నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక బహిర్గతం చేసింది. అదేవిధంగా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ (1,394 మంది మృతి), గుజరాత్ (1,204 మంది మృతి) తర్వాత మహారాష్ట్ర మూడవ స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమయంలో 1,095 అగ్ని ప్రమాదాలు సంభవించగా 820 మంది మరణించారు. కాగా, రాష్ట్రంలో ఏడాదికి అగ్ని ప్రమాదాల వల్ల సరాసరి 160 మంది మరణించగా నగరంలో 40 మంది మృత్యువాత పడుతున్నారు. ఇదిలా వుండగా 2011లో 331 అగ్ని ప్రమాదాలు సంభవించడంతో మహారాష్ట్ర రెండవ స్థానంలో నిలిచింది. ఇళ్లలో, వాణిజ్య సంస్థల్లో షార్ట్ సర్క్యూట్ల వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో మరణాల సంఖ్య పెరుగుతోందని నివేదికలో వెల్లడైంది. అదేవిధంగా 2008లో రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల వల్ల 120 మంది మృతి చెందగా 2009లో వీటి సంఖ్య 131కు పెరిగింది. కాగా 2010లో 152 మంది మరణించగా, 2011లో మృతుల సంఖ్య 263కు పెరుగగా, 2012లో 154 తగ్గిందని ఆ నివేదిక వెల్లడించింది. ఇదిలా వుండగా ‘నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా’ ప్రకారం 15 మీటర్ల కన్నా ఎత్తుగా ఉన్న భవనాలకు అగ్ని నిరోధక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అసిస్టెంట్ డివిజినల్ ఫైర్ ఆఫీసర్ హరీష్ శెట్టి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరంలో కొంతమంది భవనదారులు మాత్రమే అగ్ని ప్రమాదాలకు సంబంధించి భద్రతా నిబంధనలు పాటిస్తున్నారన్నారు. అయితే అమర్చిన పరికరాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో కొన్నిసార్లు అవికూడా పనిచేయకుండా పోతున్నాయన్నారు. కాగా, విద్యుత్బోర్డుల క్యాబిన్లలో ఇతర పనికిరాని వస్తువులను తెచ్చి ఉంచుతుండటంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇటీవల విక్రోలీలో అగ్ని ప్రమాదం జరిగిన ఎస్ఆర్ఏ భవనంలోని విద్యుత్ బోర్డు క్యాబిన్‌ను చెత్తా చెదారంతో నింపినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ క్యాబిన్ ఖాళీగా ఉండి ఉంటే అగ్ని ప్రమాదం చివరి అంతస్తు వరకు వ్యాపించి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే చాలా భవనాలకు ముందు అవసరమైన బహిరంగ స్థలం ఉంచకుండా నిర్మిస్తుండటంతో అత్యవసర సమయాల్లో ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడం అసాధ్యంగా మారుతోందని ఆయన తెలిపారు. ఫైర్ బ్రిగేడ్లు క్రమం తప్పకుండా నగర వ్యాప్తంగా ఉన్న హౌజింగ్ సొసైటీలు, ఆస్పత్రులు, వాణిజ్య సంస్థలు, ఇండస్ట్రియల్ యూనిట్లలో సర్వే నిర్వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
జ్యూయలరీ షాపు దగ్ధం
రామాయంపేట, న్యూస్‌లైన్: ప్రమాదవశాత్తు ఓ జ్యూయలరీ షాపు దగ్ధమైన ఘటన మండలంలోని నిజాంపేటలో శనివారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు 30 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడు సురేష్ చౌదరి కథనం ప్రకారం.. నిజాంపేట గ్రామానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ ఇంట్లో ఏడాది క్రితం శ్రీరాందేవ్ జ్యూయలరీ పేరిట షాపు ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎప్పటిలాగే దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున దుకాణంలోంచి మంటలు అకస్మాత్తుగా చెలరేగడంతో చుట్టుపక్కల వారు సురేష్ చౌదరికి సమాచారం అందించారు. దీంతో ఆయన అక్కడకు చేరుకొని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. అదే దుకాణంలో స్టీల్, ఫ్యాన్సీ సామగ్రి కూడా ఉండడంతో నష్టం భారీగా వాటిల్లింది. సుమారు 10 లక్షల విలువ గల స్టీల్, ఫ్యాన్సీ స్టోర్ సామగ్రి, 10 తులాల బంగారం, 20 కిలోల వెండి పూర్తిగా దగ్ధమైందని, వీటి మొత్తం విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుందని బాధితుడు సురేష్ చౌదరి తెలిపారు. కాగా ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.