6 కిలోల బంగారం చోరీ!
కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో..
కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు
కోవెలకుంట్ల (బనగానపల్లె): కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో ఓ బంగారు నగల షాపు యజమాని ఇంట్లో భారీ చోరీ జరిగింది. పెద్ద మొత్తంలో బంగారు నగలు, సొత్తు దొంగలు దోచుకెళ్లారు. యజమాని కోవెలకుంట్లలోని అమ్మవారిశాల సమీపంలో పెండేకంటి ఆంజనేయులు జ్యూవెలరీ షాపు నిర్వహిస్తు న్నాడు. భార్యకు అనారోగ్యంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఇంటికి తాళం వేసి శనివారం కుటుంబ సమేతంగా హైదరా బాద్‌లోని ఆసుపత్రికి వెళ్లారు. అదను చూసుకొని దొంగలు శనివారం అర్ధరాత్రి ఇంటి గేటు దూకి తాళాలు పగలగొట్టి బీరువా తలుపులు తెరిచి అందులో ఉన్న రూ.1.95 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
ఆదివారం తెల్లవారుజామున హైదరా బాద్ నుంచి వచ్చిన బాధితుడు ఇంట్లోకి వెళ్లి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యా దు చేశారు. జిల్లా ఎస్పీ రవికృష్ణ వివరాలను తెలుసుకున్నారు. కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.