పట్టపగలు శాస్త్రవేత్త ఇంట్లో రూ. రెండు కోట్లు దోపిడీ | Retired Scientist & His Wife Held Hostage, Robbed Cash And Jewellery Worth Of 2 Crore In Delhi, More Details Inside | Sakshi
Sakshi News home page

పట్టపగలు శాస్త్రవేత్త ఇంట్లో రూ. రెండు కోట్లు దోపిడీ

Published Sun, Oct 20 2024 7:01 AM | Last Updated on Sun, Oct 20 2024 8:55 AM

Retired Scientist Looted Around RS 2 Crore

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణిలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఒక రిటైర్డ్ సైంటిస్ట్‌తో పాటు అతని భార్యను బంధించి దోపిడీకి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోహిణిలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో తమ సొంత ఇంట్లో ఓ రిటైర్డ్ సైంటిస్ట్‌ను అతని భార్యను తుపాకీతో బెదిరించి, ఆ తర్వాత బందించి రూ. రెండు కోట్ల విలువైన నగలు నగదును దుండగులు దోచుకెళ్లారు. శాస్త్రవేత్త శిబు సింగ్‌, అతని భార్య నిర్మల ఇంట్లో ఉండగా, మధ్యాహ్నం సమయంలో ఇద్దరు యువకులు తాము కొరియర్‌ బాయ్స్‌మని చెబుతూ, వారి ఇంట్లోకి ప్రవేశించారు.

తర్వాత వారు శిబు, అతని భార్య నిర్మలను తుపాకీతో బెదిరించి, బందించారు. ఈ క్రమంలో నిందితులు వారిపై దాడి చేశారు. దుండగుల తమ ఇంట్లోని రూ. రెండు కోట్ల విలువైన నగలు, నగదు దోచుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే బాధితులు ఈ విషయాన్ని తమ కుమారునికి తెలియజేశారు. ఆయన ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్లు ప్రారంభించారు. బాధితులిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా ఈ ఘటన తీరు చూస్తుంటే ఈ వ్యవహారంలో  తెలిసినవారి ప్రమేయం ఉన్నట్లు కనిపిస్తోందని పోలీసులు అంటున్నారు. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. 

ఇది కూడా చదవండి: వికాస్‌ యాదవ్‌ కథలో కొత్త మలుపు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement