కడప అర్బన్ : కడప వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అయ్యవారయ్య డెబిట్ కార్డు వివరాలను ఉపయోగించి రూ.84 వేలు మాయం చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు అందింది.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి మాయమాటలతో ఎస్‌బీఐ డెబిట్ కార్డు గురించి వివరాలు తెలుసుకున్నారు. డెబిట్ కార్డును పరిశీలించగా దాన్ని ఉపయోగించి రూ.84 వేలు షాపింగ్ చేసినట్లుగా చూపడంతో ఖంగుతిన్నాడు. సీఐ టీవీ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.