ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నెల్లూరు : ఓవైపు నట్టింట్లోకి టెక్నాలజీ సేవలు వచ్చి చేరడంతో ఆన్‌లైన్ మోసాలు పెరిపోగా.. మరోవైపు టీ దగ్గర నుంచి బాంబు చుట్టడం వరకు యూట్యూబ్ పుణ్యమా అని అందరూ నేర్చేసుకుంటున్నారు. ఇక మూఢనమ్మకాల పేరుతో బురిడీ కొట్టించడానికి ‘మహిమగాళ్ల’కు అమాయక జనం కొరత ఎప్పడూ ఉండదు. తాజాగా నెల్లూరు జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.
అక్షయ పాత్ర పేరుతో జిల్లాలో జరిగిన భారీ మోసం బయటపడింది. అక్షయ పాత్రకు ఉన్న మహిమతో భారీగా సంపాదించవచ్చని పలువురికి ఆశ చూపిన నలుగురు వ్యక్తులు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రసాద్ రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన కోళ్ల శేషగిరితో పాటు మరో ముగ్గురిని బురిడీ కొట్టించారు. వారి వద్ద నుంచి కోట్ల రూపాయాలు వసూలు చేశారు. అక్షయపాత్ర మోసాన్ని గ్రహించిన ప్రసాద్‌రెడ్డి చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. నిందితులు వికాస్, సుభాష్‌లను అరెస్టు చేసిన పోలీసులు.. వారివద్ద నుంచి రూ.51 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment