akshayapatra
-
‘అక్షయపాత్ర’ రోజూ పంపిన లక్ష భోజనాలు ఏమయ్యాయి?
సాక్షి, అమరావతి: వరద బాధితుల భోజనాలపై కూటమి ప్రభుత్వం రూ.368 కోట్లు ఖర్చు చేస్తే.. అక్షయపాత్ర ఫౌండేషన్ రోజూ లక్ష మందికి అందించిన భోజనాలు ఏమయ్యాయని, ఇతర స్వచ్ఛంద సంస్థలు చేసిన సాయం మాటేమిటని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నిలదీశారు. సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి తప్పుడు లెక్కలతో రూ.534 కోట్లను కూటమి నేతలు దోచేశారని ధ్వజమెత్తారు. ఒక్క పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయకుండా రూ.1.39 కోట్లు,మంచినీళ్ల బాటిళ్లకు రూ.26 కోట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపిందన్నారు. ఏ కాంట్రాక్టర్ ద్వారా ఆ ఏర్పాట్లు చేశారో ప్రభుత్వంవివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.బాధితులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ప్రభుత్వం నిజంగా బాధితులకు సాయం చేసి ఉంటే.. ఇప్పుడు కలెక్టరేట్ వద్దకు వేలా దిమంది ఎందుకు పోటెత్తుతున్నా రని అవినాష్, భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. పారిశుధ్య కార్మికులకు రూ.51 కోట్లు ఇచ్చామంటున్న ప్రభుత్వం ఎవరి ద్వారా అవి చెల్లించారో చెప్పాలన్నారు. ఆహారం పంపిణీ కోసం 412 డ్రోన్లు ఉపయోగించి, అందుకోసం రూ.2 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నారని, నిజానికి అప్పుడు కనీసం 10 డ్రోన్లు కూడా కనపడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూ.534 కోట్లకు సరైన లెక్కలు చెప్పే వరకు ఊరుకోబోమని, వరద బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు ప్రకటించారు. -
అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించిన సీఎం జగన్
-
రూ.50 లక్షలు స్వాహా చేసిన ‘అక్షయపాత్ర’..!
సాక్షి, నెల్లూరు : ఓవైపు నట్టింట్లోకి టెక్నాలజీ సేవలు వచ్చి చేరడంతో ఆన్లైన్ మోసాలు పెరిపోగా.. మరోవైపు టీ దగ్గర నుంచి బాంబు చుట్టడం వరకు యూట్యూబ్ పుణ్యమా అని అందరూ నేర్చేసుకుంటున్నారు. ఇక మూఢనమ్మకాల పేరుతో బురిడీ కొట్టించడానికి ‘మహిమగాళ్ల’కు అమాయక జనం కొరత ఎప్పడూ ఉండదు. తాజాగా నెల్లూరు జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. అక్షయ పాత్ర పేరుతో జిల్లాలో జరిగిన భారీ మోసం బయటపడింది. అక్షయ పాత్రకు ఉన్న మహిమతో భారీగా సంపాదించవచ్చని పలువురికి ఆశ చూపిన నలుగురు వ్యక్తులు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రసాద్ రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన కోళ్ల శేషగిరితో పాటు మరో ముగ్గురిని బురిడీ కొట్టించారు. వారి వద్ద నుంచి కోట్ల రూపాయాలు వసూలు చేశారు. అక్షయపాత్ర మోసాన్ని గ్రహించిన ప్రసాద్‌రెడ్డి చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. నిందితులు వికాస్, సుభాష్‌లను అరెస్టు చేసిన పోలీసులు.. వారివద్ద నుంచి రూ.51 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఈ 'అక్షయ' పాత్ర లక్షమందికి వడ్డిస్తుంది!
సాక్షి, తిరుమల: అక్షయపాత్రను శరణువేడితో ఆహార సంపదకు కొదవ ఉండదు. అదే సత్సంకల్పంతోనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అక్షయ పాత్ర పేరుతో కొత్త వంటశాల నిర్మిస్తోంది. రోజుకు లక్ష మందికి ఆహార పదార్థాలు తయారు చేసేలా ఈ వంటశాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మహాయజ్ఞంలా టీటీడీ అన్నప్రసాదం వితరణ గత 30 వసంతాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా నిర్వహిస్తోంది. 1985 ఏప్రిల్ 6న రెండువేల మందితో ప్రారంభించి ప్రస్తుతం 1.27 లక్షల మందికి అన్నప్రసాదాలు అందిస్తోంది. ప్రధానంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద కేంద్రంతోపాటు రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని వంటశాలల ద్వారా రోజుకు రూ.1.06 లక్షల మందికి, తిరుపతిలోన తిరుచానూరులో మరో 26 వేల మందికి అన్నప్రసాదాలు తయారుచేసి వడ్డిస్తున్నారు. ‘అక్షయ’ వంటశాలతో మరో లక్ష మంది అన్నప్రసాదాలు సాధారణ రోజుల్లో వచ్చే భక్తులకు ప్రస్తుతం ఉన్న రెండు వంటశాలలు సరిపోతున్నాయి. అయితే, రద్దీ రోజుల్లోనూ, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లోనూ వచ్చే భక్తుల రద్దీకి ఇవి సరిపోవటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మరో లక్ష మందికి అన్నప్రసాదాలు వడ్డించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. పైగా రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని వంటశాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఆ వంటశాలతో వైకుంఠం క్యూకాంప్లెక్స్ పటిష్టత దెబ్బతినే అవకాశం కూడా ఉందని గుర్తించారు. దీంతో వెలుపల ప్రాంతంలో రోజుకు లక్ష మంది భక్తులకు అన్నప్రసాదాలు వండేలా కొత్త వంటశాల రూపొందించారు. ఈ కొత్త వంటశాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మార్చి చివరినాటికి నిర్మాణం పనులు పూర్తవుతాయి. అక్షయను వేసవికి అందుబాటులోకి తీసుకొస్తాం 'అక్షయ' కొత్త వంటశాలను వేసవినాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారు ఆదేశించారు. ఆమేరకు మార్చినాటికి నిర్మాణం పనులు పూర్తవుతాయి. ఆ వెనువెంటనే వంటశాలకు సామగ్రి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ వండే అన్నప్రసాదాలు శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూలోని భక్తులకు, కంపార్ట్మెంట్లలో వేచి ఉండేవారికి, ఉత్సవాల సమయాల్లో ఆలయ వీధుల్లో వేచి ఉండే భక్తులకు వడ్డిస్తాం. ఎంత రద్దీ వచ్చినా అందరికీ సులభంగా అన్నప్రసాదాలు వితరణ చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. -సాగి వేణుగోపాల్, టీటీడీ డెప్యూటీ ఈవో