![Man Kills Brother Over Affair With Wife in Garladinne Anantapur District - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/23/couples-on-bike.jpg.webp?itok=kRbPY5bP)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అనంతపురం(గార్లదిన్నె): గత నెల 19న గార్లదిన్నె మండలం రామదాసుపేట సమీపంలో రైలు పట్టాలపై లభ్యమైన యువకుడి మృతదేహం కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగా సొంత తమ్ముడినే అన్న హతమార్చినట్లుగా నిర్దారణ కావడంతో సోమవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాలను సీఐ శివశంకర్ నాయక్ వెల్లడించారు. మడకశిర మండలం ఎర్రబొమ్మనపల్లికి చెందిన రంగనాథ్, అనంతరాజు (30) అన్నదమ్ములు. తన భార్యతో అనంతరాజు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడం గమనించిన రంగనాథ్ కొన్నేళ్ల క్రితమే ఆమెను హతమార్చాడు.
అనంతరం ఏడేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతోనూ అనంతరాజు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లుగా రంగనాథ్ అనుమానాలు పెంచుకుని గొడవపడేవాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు యువకులతో కలిసి గార్లదిన్నె మండలం కల్లూరులో అద్దె ఇంటిలో ఉంటూ కేబుల్ పనుల్లో అనంతరాజు పాల్గొనసాగాడు. విషయం తెలుసుకున్న రంగనాథ్ గత నెల 19న రాత్రి కల్లూరుకు చేరుకుని మిద్దెపై నిద్రిస్తున్న అనంత రాజు గొంతుమీద ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. అనంతరం బెల్ట్‌ను గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు.
చదవండి: (ప్రేమ వివాహం.. కొత్తగా పరిచయమైన మరో ప్రియుడి మోజులో)
మృతదేహాన్ని కారులో తీసుకుని రామదాసుపేట సమీపంలోని రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హతుడి భార్య సుజాత ఫిర్యాదు చేయడంతో కేసును గార్లదిన్నె పోలీసులకు రైల్వే పోలీసులు రెఫర్ చేశారు. దర్యాప్తులో అనంతరాజును రంగనాథ్∙హతమార్చినట్లుగా నిర్ధారణ కావడంతో సోమవారం అనంతపురం రూరల్‌మండలం సోముల దొడ్డి వద్ద అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment