
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, అనంతపురం(నార్పల): ఈ నెల 9న నార్పల మండలం నాయనపల్లిలో చోటు చేసుకున్న అట్టే నారాయణస్వామి (26) హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివరాలను సీఐ విజయభాస్కరరెడ్డి, ఎస్‌ఐ వెంకటప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వీరనారప్పగౌడ్, నారాయణస్వామి అన్నదమ్ములు. అన్న వీరనారప్ప భార్య పద్మావతితో నారాయణస్వామి వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. విషయం తెలుసుకున్న అన్న హెచ్చరికతో పద్మావతిలో మార్పు వచ్చింది.
అయితే తన కోరిక తీర్చాలంటూ నారాయణస్వామి వేధిస్తుండడంతో విషయాన్ని భర్తకు తెలిపింది. దీంతో తమ్ముడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 9న రాత్రి 9 గంటలకు తన పొలంలోని చింతచెట్టు వద్దకు నారాయణస్వామిని రప్పించుకున్నారు. పద్మావతితో మాట్లాడుతుండగా అప్పటికే మాటు వేసి ఉన్న అన్న వీరనారప్పతో పాటు పెద్దనాన్న కుమారుడు పెద్ద వీరనారప్ప దాడి చేశారు.
చదవండి: (వదినతో వివాహేతరం సంబంధం.. మరో పెళ్లి చేసుకుంటే.. ఆమెతోనూ..)
కిందపడిన మరిది చేతులను పద్మావతి, కాళ్లను పెద్ద వీరనారప్ప పట్టుకోగా.. నారాయణస్వామి బీజాలపై అన్న బలంగా తన్ని బీరు సీసా ముక్కతో మర్మాంగాన్ని కోశాడు. తర్వాత మెడలోని తాయత్తు దారం తీసి నారాయణస్వామి గొంతు బిగించి హతమార్చాడు. కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం సాయంత్రం అనుమానంతో వీరనారప్పను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం తెలిసింది. దీంతో అట్టె వీరనారప్ప, పద్మావతి, పెద్ద వీరనారప్పను గురువారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment