20 ఏళ్లుగా మహిళతో దోస్తాన్‌.. వద్దని ఎంత చెప్పినా వినకపోవడంతో... | Assassination Of Man Due To Extramarital Affair In Anantapur District | Sakshi
Sakshi News home page

Extramarital Affair: 20 ఏళ్లుగా మహిళతో దోస్తాన్‌.. వద్దని ఎంత చెప్పినా వినకపోవడంతో...

Published Fri, Mar 11 2022 3:19 PM | Last Updated on Fri, Mar 11 2022 8:02 PM

Assassination Of Man Due To Extramarital Affair In Anantapur District - Sakshi

రామాంజనేయులు (ఫైల్‌ ఫొటో)

పుట్టపర్తి(అనంతపురం జిల్లా): వివాహేతర సంబంధం వద్దన్నా వినకుండా వేధిస్తుండడంతో మహిళ సంబంధీకులు జరిపిన దాడిలో ఓ వ్యక్తి హతమయ్యాడు. వివరాలను బుక్కపట్నం ఎస్‌ఐ నరసింహుడు గురువారం వెల్లడించారు. బుక్కపట్నం మండలం గశికవారిపల్లికి చెందిన బలపనూరు రామాంజనేయులు (55) అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో 20 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

చదవండి: భార్య బ్యూటీ పార్లర్‌.. కోల్‌కతాలో భర్త.. తరచూ ఫోన్‌ చేసి వేధిస్తుండటంతో..

ఈ క్రమంలో పిల్లలు పెద్దవాళ్లయ్యారని, వివాహేతర సంబంధం కొనసాగించడం ఇబ్బందికరంగా ఉందంటూ ఐదేళ్లుగా ఆ మహిళ దూరంగా ఉంటూ వస్తోంది. ఈ నెల 6న రామాంజనేయులు ఆమె ఇంటివద్దకెళ్లి ఒత్తిడి చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో గొడవ పడి చితక్కొట్టాడు. విషయం తెలుసుకున్న మహిళ సోదరుడు రమేష్, మరిది ధనుంజయ, కుమారుడు రవి.. అదే రోజు ముదిగుబ్బ నుంచి వచ్చి రామాంజనేయులుపై రోకలితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రామాంజినేయులు కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఘటనకు సంబంధించి దాడి చేసిన రవి, ధనుంజయ, రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement