![Young Man Assassination Because Of An Extramarital Affair In Anantapur - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/13/Young-Man-Assassination-Bec.jpg.webp?itok=ybsG0WII)
సుంకేనాయక్ (ఫైల్)
గుంతకల్లు(అనంతపురం జిల్లా): వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లు మండలం గుండాలతండాకు చెందిన స్వామి నాయక్, మంగమ్మ దంపతులు కొన్నేళ్ల క్రితమే గుంతకల్లుకు చేరుకుని చైతన్య థియేటర్ సమీపంలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. హైదరాబాద్‌లో స్వామినాయక్ కారు డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబ పోషణకు డబ్బు పంపించేవాడు. ఈ క్రమంలో స్వామినాయక్ చిన్నాన్న కుమారుడు సుంకేనాయక్ తరచూ మంగమ్మ ఇంటికి రాకపోకలు సాగించేవాడు.
చదవండి: అమెరికాలో ఆమెతో రిలేషన్‌షిప్.. ఏపీలో మరో యువతిని ట్రాప్ చేసి..
బుధవారం ఉదయం ఇద్దరు పిల్లలు స్కూల్‌కు వెళ్లిన తర్వాత మంగమ్మ ఇంటికి సుంకేనాయక్ చేరుకున్నాడు. కాసేపటికి స్వామినాయక్ కూడా ఇంటికెళ్లాడు. ఆ సమయంలో బెడ్‌రూంలో సుంకేనాయక్, మంగమ్మ ఏకాంతంగా ఉండడం చూసి కోపోద్రిక్తుడైన స్వామినాయక్ కత్తితో సుంకేనాయక్‌పై దాడి చేశాడు. అడ్డుకోబోయిన భార్య మంగమ్మ తలపై బాది నేరుగా వెళ్లి కసాపురం పోలీసులకు లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని డీఎస్పీ నర్శింగప్ప, టూటౌన్ సీఐ చిన్నగోవిందు పరిశీలించారు. అప్పటికే సుంకేనాయక్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మంగమ్మను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment