
రోడ్డెక్కిన రైలు
గార్లదిన్నె : సాధారణంగా రైలు ఇంజన్లు పట్టాలపై ఒక చోట నుంచి మరో చోటికి వెళ్తుంటాయి. కానీ ముంబాయి నుండి నాగపూర్‌కు 40 చక్రాల లగేజీ వాహనంలో రైలు ఇంజన్ ఆదివారం తరలించారు. మార్గమధ్యలో గార్లదిన్నె మండలం ఎగువపల్లి జాతీయ రహదారిపై డ్రైవర్ ఆ వాహనాన్ని నిలపడంతో స్థానికులు ఆసక్తిగా గమనించారు.