గార్లదిన్నె: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణికి ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రూ.లక్ష అసలైన నగదుకు గాను రూ.3 లక్షల విలువజేసే నకిలీ నోట్లు ఇస్తామంటూ కల్లూరు రైల్వే స్టేషన్ వద్ద బేరసారాలు ఆడే క్రమంలో రాజ్‌కుమార్, రామకృష్ణ, సురేంద్రబాబులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువజేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.