-
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
-
వాడవాడలా కల్యాణోత్సవాలు
శ్రీరామ నవమి మహోత్సవం జిల్లా వ్యాప్తంగా సందడిగా సాగింది. జిల్లాలోని పెదపూడి మండలం జి.మామిడాడలోని కోదండరామ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడిపోయింది. అన్నవరంలోని రత్నగిరిపై, కె.గంగవరం మండలంలోని సత్యవాడలో జరిగిన కల్యాణోత్సవం కనువిందు చేసింది. ఏజెన్సీ ప్రాంతమైన వీఆర్ పురం మండలం శ్రీరామగిరిలో శ్రీరామ నామస్మరణ మారుమోగిపోయింది. రాజమహేంద్రవరం, కాకినాడలతోపాటు అన్ని ప్రాంతాల్లోని రామాలయాలే కాకుండా వీధుల్లో కూడా స్వచ్ఛందంగా చలువ పందిళ్లు వేసుకొని అర్థరాత్రి వరకూ భజనలు, భక్తి గీతాలతో భక్తులను అలరింపజేశారు.
జి.మామిడాడ(పెదపూడి) :
వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. బాజాభజంత్రీలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల శ్రీరామనామస్మరణతో కోదండరాముని కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పంచభూతాలు సాక్షిగా.. ఆకాశమంత పందిరిలో.. భూదేవంత పీటపై సీతారాముల వారి కల్యాణం కనుల పండువగా సాగింది. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పెదపూడి మండలం గొల్లలమావిుడాడలోని శ్రీ కోదండరామాలయంలో సీతారాముని కల్యాణం కడు రమణీయంగా జరిగింది. బుధవారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయ సమీపంలోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకటకూర్మరంగనాథాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం 11.10 గంటలకు స్వామి వారిని కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ప్రభుత్వం తరఫున కలెక్టర్ సీహెచ్ అరుణకుమార్, శ్రీదేవి దంపతులు, సీతారాములకు పట్టువస్త్రాలు తలంబ్రాలను సమర్పించారు. అలాగే ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి, తోటత్రిమూర్తులు సూర్యకుమారి, పట్టువస్త్రాలు స్వామివారికి సమర్పించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ద్వారంపూడి వెంకటరెట్టి మంచిముత్యాలు తలంబ్రాలు స్వామి వారికి సమర్పించారు. 11.40 గంటలకు ఆలయ ధర్మకర్తలు ద్వారంపూడి శ్రీదేవి మహాలక్ష్మి ఇంటి నుంచి మంచి ముత్యాలు, తలంబ్రాలు, 9 రకాల పండ్లు, పుష్పాలు, పట్టు వస్త్రాలను పల్లకిలో ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా తాడి శ్రీ వ్యవహరించారు.
12 గంటలకు ప్రారంభం..
మ««ధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ సంకల్పం ప్రారంభమైంది. మ్యధ్యాహ్నం 1.26 గంటలకు రక్షాబంధ¯ŒS చేశారు. 1.26 గంటలకు మంచి ముత్యాల దండ చూపించారు. మంత్రస్నానం చేయించారు. కన్యాదానం చేశారు. 2.05 గంటలకు జీలకర్ర బెల్లం కల్యాణమూర్తుల శిరస్సుపై ఉంచారు. 2.20 గంటలకు మాంగల్య సూత్రధారణ రాముల వారితో చేయించారు. 2.30 గంటలకు తలంబ్రాలు తంతు పూర్తి చేశారు. రామయ్య తండ్రి కల్యాణాన్ని భక్తులు కనులారా తిలకించారు. ఇక్కడ ఆనవాయితీగా సాగే పిల్లల వేలంపాట తంతు యథావిధిగా జరిగింది. కల్యాణం తలంబ్రాలు వేసుకున్నవారికి కొద్ది కాలంలోనే కల్యాణం జరుగుతుందని, ముందురోజు ఆలయానికి చేరి నిద్రించేవారికి సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. కల్యాణానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు తలంబ్రాలు, బియ్యం పంపిణీ చేశారు. ఆలయ ఆర్గనైజర్ నల్లమిల్లి అచ్చుతానందరెడ్డి, పలువురు ఏర్పాట్లు పర్యవేక్షించి సేవలందించారు.
-
జగన్మోహినీ కేశవస్వామి కల్యాణం
ర్యాలి(ఆత్రేయపురం) :
ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి కల్యాణాన్ని బుధవారం రాత్రి 8.45గంటలకు వేదమంత్రోచ్ఛారణ నడుమ కడు రమణీయంగా నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్ర పండితులు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన శ్రీనివాసులు వెంకటచార్యుల ఆధ్వర్యంలో వేదపండితులు, ఆలయ అర్చకులు కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపంలో మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. జగన్మోహిని, కేశవస్వామికి వేదపండితులు వాడపల్లి రంగాచార్యులు, పెద్దింటి శ్రీనివాసాచార్యులు, వాడపల్లి భాస్కరాచార్యులు , వేదపండిట్ టీవీ ఫణికుమార్, పురాణ పండిట్ హరిరామనా«థ్‌లు వివాహ క్రతువు నిర్వహణకు సహకరించారు. తొలుత స్వామి వార్ల ఉత్సవ విగ్రహలను గర్భగుడి నుంచి కల్యాణ మండపం వద్దకు తోడ్కొని వచ్చారు. ముందుగా పండితులు విశ్వక్షేణ పూజ, పుణ్యహవచనం, నిత్యహోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, అంకురార్పణ తదితర కార్యక్రమాలు ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. సంప్రదాయ ప్రకారం ఆలయ ఈవో వై. వెంకటేశ్వరరావు పట్టు వస్త్రాలు , మంగళసూత్రాలను సమర్పించారు. ఉదయం ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా పూల మాలలతో అలంకరించి గరుడ వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఈవో వెంకటేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ కరుటూరి నరసింహరావు, జగన్మోహినీ కేశవస్వామి ఆలయ మాజీ చైర్మన్ పి.సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.
శ్రీరామగిరి(వీఆర్‌పురం) : మరో భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీరామగిరి సుందర సీతారామచంద్ర స్వామివారి కల్యాణం రామనామస్మరణ మధ్య అంగరంగ వైభవంగా బుధవారం జరిగింది. పుణ్యగోదావరి, పవిత్ర శబరి నదుల సంగమ ప్రాంతానికి చేరువగా మాతంగ మహారుషి నిర్మించిన ఆలయంలో సుందర సీతారామచంద్రస్వామి వారి కల్యాణం అశేష భక్తజనుల నడుమ సాగింది. భక్తులు తనివితీరా కల్యాణాన్ని వీక్షించారు. సుందర సీతారామచంద్రులకు చేతులు జోడించి జేజేలు పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సౌమిత్రి పురుషోత్తమాచార్యులు వివాహ వేడుకలో భాగంగా కొండవీుద ఆలయంలో తెల్లవారుజామున ఒంటి గంటకు ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం కల్యాణ ఘట్టాలను క్రమ పద్ధతిలో చేపట్టారు. పుణ్య నదీతీర్థాన్ని స్వామివారికి సమర్పించిన అనంతరం అర్చకులు కల్యాణ పనుల్లో నిమగ్నమయ్యారు. సీతారాములను ఆలయంలో వధూవరులుగా చేశారు. అలాగే గర్భగుడిలోని మూలవిరాటులకు కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేసి దేవరాజ వాహనంపై కొండ దిగువన ఉన్న కల్యాణ మండపానికి ఊరేగింపుగా తోడ్కొని వచ్చి, వేదికపై అధిష్టింపజేశారు. అక్కడ ముందుగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, శోడషోపచార పూజలను వేదపండితులు నిర్వహించారు. పూర్ణాహుతుని తదుపరి శాంతి కల్యాణాన్ని చేపట్టారు. సంకల్పం, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల ఘట్టాలతో మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ కల్యాణోత్సం వైభవంగా జరిగింది.
పట్టువస్త్రాలు అందజేసిన ఎమ్మెల్యే రాజేశ్వరి..
స్వామివారి కల్యాణానికి రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, చింతూరు ఐటీడీఏ పీఓ చినబాబులు పట్టువస్త్రాలు సమర్పించారు. వీరితో పాటు మరికొందరు భక్తులు స్వామివారికి పట్టువస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎటపాక సీఐ ఆర్.రవికుమార్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లా¯ŒS కమిటీ సభ్యురాలు కొమరం ఫణీశ్వరమ్మ, ఎంపీపీ కారం శిరమయ్య, జెడ్పీటీసీ సభ్యురాలు ముత్యాల కుసుమాంబ, తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, ఎంపీడీఓ జి.సరోవర్, వీఆర్‌పురం ఎస్సై ఎ¯ŒS.రామకృష్ణ , కూనవరం ఎస్సై అజయ్‌బాబు, ఆలయ కమిటీ చైర్మ¯ŒS ఆచంట శ్రీనివాస్, ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ వి.గాంధీబాబు తదితరులు పాల్గొన్నారు.