- ఘనంగా షష్ఠి మహోత్సవాలు ప్రారంభం
- రాత్రి 8 గంటలకు స్వామివారి దివ్య కల్యాణం
సుబ్బారాయుడి కల్యాణం చూతము రారండి
Published Sun, Dec 4 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
అన్నవరం :
దేవస్థానం హైస్కూల్ ఎదురుగా ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారి షష్ఠి మహోత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వధూవరులను చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి వివాహమహోత్సవాన్ని పురస్కరించుకొని ముత్తయిదువులు పసుపు దంచారు. రాత్రి ఏడు గంటలకు మయూర వాహనంపై వల్లీ, దేవసేన అమ్మవార్లను, స్వామివారిని శేషవాహనంపై పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. కార్యక్రమాలను అన్నవరం దేవస్థానం ప్రధానార్చకులు గాడేపల్లి వెంకట్రావు, అర్చక స్వాములు ఇంద్రగంటి బుల్లి, నర్సింహమూర్తి, అన్నవరం గ్రామ పురోహితుడు దేవులపల్లి మూర్తి, ఆలయ అర్చకుడు మూర్తి తదితరులు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
l
Advertisement
Advertisement