కమనీయం... శ్రీ జ్వాలనరసింహుడి కల్యాణం | glorious jwalanarasimha kalyanam | Sakshi
Sakshi News home page

కమనీయం... శ్రీ జ్వాలనరసింహుడి కల్యాణం

Published Fri, Mar 10 2017 12:23 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

కమనీయం... శ్రీ జ్వాలనరసింహుడి కల్యాణం

కమనీయం... శ్రీ జ్వాలనరసింహుడి కల్యాణం

ఆళ్లగడ్డ : బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల తిరు కల్యాణోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగా అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీమన్‌ శఠకోప రంగనాధయతీంద్ర మహదేశికన్‌ ఆధ్యర్యంలో ఉత్సవ మూర్తులకు సంప్రదాయబద్ధంగా ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపానికి   తీసుకొచ్చారు.  పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి, అమ్మవారికి కంకణధారణ నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందా నామస్మరణ మధ్య మాంగల్యధారణ నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు పోశారు.  అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారిని కల్యాణాన్ని వీక్షించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement