నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
రాములోరికి భక్తిశ్రద్ధలతో నిత్యకల్యాణం
lord ram kalyanam
రాములోరికి, భక్తిశ్రద్ధలతో, నిత్యకల్యాణం
lord, ram, kalyanam
భద్రాచలం: శ్రీసీతారామచంద్ర స్వామివారికి గురువారం భక్తిశ్రద్ధలతో నిత్యకల్యాణం నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన చేసి, గోదావరి నదినుంచి తీర్థ జలాలను తీసుకొచ్చి భద్రుని గుడిలో అభిషేకం పూర్తి చేశారు. అనంతరం స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. అనంతరం అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి, స్వామి వారికి నిత్యకల్యాణ తంతు పూర్తి చేసి, భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.